వార్తలు (News)

ఆయుర్వేద వైద్యానికి ఆద్యుడు.. డా.పీకే వారియర్‌ కన్నుమూత!!

కేరళ ఆయుర్వేద వైద్యానికి ఆద్యుడిగా ప్రసిద్ధి చెందిన డా.పన్నియంపిల్లి కృష్ణన్‌కుట్టి వారియర్‌(100) శనివారం కన్ను మూసినట్టుగా ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. ఆయుర్వేద వైద్యుడిగా ఆయన ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మందికి చికిత్స అందించగా వారిలో భారత మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు సహా ఇతర దేశాధ్యక్షులు కూడా ఉన్నారు.

1999లో పద్మశ్రీ, 2010లో పద్మభూషణ్‌ పురస్కారాలతో భారత ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది. 1921, జూన్‌ 5న డా.పీకే వారియర్ జన్మించారు. జూన్‌ 8న ఆయన వందో పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. కొట్టక్కల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన వారియర్‌ తన 20వ ఏట కేఏఎస్‌లో చేరి తన 24వ ఏట చదువు పూర్తి కాగానే కేఏఎస్‌ ట్రస్టీగా బాధ్యతలు స్వీకరించారు. గడిచిన ఆరు దశాబ్దాలుగా తన అమూల్యమైన సేవలతోపాటు కేఏఎస్‌కు అంతర్జాతీయంగా ఆయన మంచి గుర్తింపు తెచ్చారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •