అంతర్జాతీయం (International) వార్తలు (News)

రాణి.. ది సెలబ్రిటీ..!

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ‘రాణి’ అనే ఒక సెలబ్రిటీ పేరు మారుమ్రోగిపోతుంది. ఇంతకీ రాణి అంటే ఎవరు అనుకుంటున్నారా?? అది మరెవరో కాదు అదొక భూటాన్ జాతి ఆవు. దాని వయసు రెండు సంవత్సరాలు. ఎత్తు కేవలం 51 సెం.మీ, బరువు 28 కిలోలు. ప్రస్తుతం రాణి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు దగ్గర్లో ఉన్న చారీగ్రామ్‌లోని ఒక ఫామ్ హౌస్‌లో ఉంది. రాణిని చూడ్డానికి, పక్కనే నిల్చుని ఫొటోలు దిగడానికి వివిధ ప్రాంతాల నుంచి జనం తరలివస్తున్నారు. రాణి ప్రపంచంలోనే అతి చిన్న ఆవు.

ఇప్పటి వరకు ప్రపంచంలో అతి చిన్న ఆవుగా భారత దేశానికి చెందిన ‘మాణిక్యం’ గుర్తింపు పొందింది. ఈ ఆవు ఎత్తు 61.1 సెం.మీ. మాత్రమే. ఈ సంవత్సరమే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బృందం రాణిని చూడ్డానికి వస్తారని, “ప్రపంచంలోనే అత్యంత చిన్న ఆవు” అనే గుర్తింపు రాణికి ఇవ్వాలో, వద్దో నిర్ణయిస్తారని తెలిసింది.

బంగ్లాదేశ్‌లోని నౌగావ్ జిల్లాలోని ఒక ఫామ్ నుంచి కిందటి ఏడాది హసన్ హోలాదార్ రాణిని తీసుకువచ్చారు. “రాణికి నడవడంలో కాస్త ఇబ్బంది ఉంది. అందుకే ఫామ్‌లో మిగతా ఆవులతో కాకుండా విడిగా ఉంచుతున్నాం. పెద్ద ఆవులు దానికి హాని కలిగిస్తాయేమోనని మాకు భయమేస్తుంటుంది” అని హసన్ హోలాదార్ చెప్పారు.

ముస్లింల పండుగ ఈద్ దగ్గర్లోనే ఉండడంతో రాణిని బలి కోసం అమ్మేస్తారేమోనని కొందరు ఆందోళన వ్యక్తం చేయగా తనకు అలాంటి ఉద్దేశాలేమీ లేవని హసన్ స్పష్టం చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •