టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

రాజస్థాన్ ఉపాధ్యాయుల అంకిత భావం.. ఒంటిపై ప్రయాణించి మరీ..??

రాజస్థాన్‌ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అసాధ్యమైనా సరే సుసాధ్యం చేస్తామని నిరూపిస్తున్నారు. కరోనా కారణంగా పాఠశాలలన్నీ మూతపడటంతో ఆన్‌లైన్‌ విద్యనే విద్యార్థులకు మార్గం కాగా కొందరు విద్యార్థులకు సాంకేతిక లోపాలు, డిజిటల్‌ వసతుల కొరత, ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పినా అర్థం కాకపోవడం..తదితర సమస్యలు తలెత్తడంతో
ద్యార్థులకు పాఠాలు అర్థమయ్యేలా చెప్పాలనే సంకల్పంతో విన్నూతంగా ఆలోచించి కష్టమైనా సరే విద్యార్థుల ఇళ్లకు ఒంటెలపై వెళ్లి పాఠాలు బోధించాలని నిర్ణయానికి వచ్చారు. ఇంటర్నెట్‌ సదుపాయం లేని విద్యార్థులకు మాత్రమే ఈ విధంగా పాఠాలు చెప్పడం ప్రారంభించారు.

మొత్తం 75 లక్షల మంది విద్యార్థుల్లో చాలా మందికి మొబైల్‌ సదుపాయం లేకపోవడంతో వారానికోసారి 1-8 తరగతులు, వారానికి రెండుసార్లు 9-12 తరగతుల విద్యార్థుల ఇంటికి వెళ్లి పాఠాలు బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాస్త కష్టమైనా ఈ ఆలోచనకు ఉపాధ్యాయులందరూ సహకరిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •