క్రైమ్ (Crime) వార్తలు (News)

చిన్నమడూర్ చెరువులో అస్థిపంజరం.. ??

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం చిన్నమడూర్ చెరువులోకి గ్రామానికి చెందిన మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా చేపలు పట్టే సమయంలో వలకు అస్థిపజరం చిక్కడంతో మత్స్యకారులు షాక్‌కు గురయ్యారు. అయితే ఆ అస్థిపజరంకు ఉన్న చీరను బట్టి పదిరోజుల క్రితం గ్రామం నుంచి బయటకువెళ్లిన మహంకాళి సోమలక్ష్మి(56)గా వారు గుర్తించి గ్రామస్థులు దేవరుప్పుల పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •