వార్తలు (News)

ఒక శరీరంలో రెండు వేరియంట్స్.. ఎలా సాధ్యం??

సెకండ్ వేవ్ దాదాపుగా తగ్గినట్లుగా అనిపిస్తోన్నఈ సమయంలో కోవిడ్-19 కొత్త వేరియంట్ల గురించి చర్చ కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే కరోనాతో మరణించిన ఒక 90ఏళ్ల మహిళ ఒకే సమయంలో కరోనావైరస్ లో ​ఆల్ఫా మరియు బీటా వేరియంట్స్‌ను కలిగి ఉండడం ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది.

అసలు కరోనా రెండు వేరియంట్లు ఉండడానికి కారణం ఏంటీ? కరోనా శరీరంలోకి ఎంటర్ అయ్యాక రెండు వేరియంట్లుగా మారిందా? ఐదు రోజుల్లోనే చనిపోయేంత పరిస్థితి రెండు వేరియంట్లు తీసుకుని వచ్చాయా అనే అనుమానాలు చెలరేగడంతో బెల్జియంలో పరిశోధకులు చివరకు అసలైన విషయాన్ని కనుగొన్నారు.

ఒంటరిగా నివసించే వృద్ధురాలు చనిపోయిన తర్వాత పరీక్షలు జరిపి బ్రిటన్లో ఉద్భవించిన ఆల్ఫా జాతి మరియు బీటా వేరియంట్ రెండింటినీ ఆమె శరీరంలో కనుగొన్నారు. అయితే, రెండు వేరియంట్లు కూడా బయటనుంచే ఆమెకు సోకినట్లుగా వైద్యులు గుర్తించారు. ఒకేసారి ఒకే వ్యక్తి నుంచి కాకుండా ఇద్దరు వ్యక్తుల నుంచి కరోనా సోకడంతో రెండు వేరియంట్లు ఆమె శరీరంలోకి ప్రవేశించాయిని, రెండు వేరియంట్లను తట్టుకోలేక ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు పరిశోధకులు స్పష్టం చేశారు.

మొదట్లో ఆమె ఆక్సిజన్ స్థాయిలు బాగానే ఉన్నప్పటికీ ఆరోగ్యంగా ఉన్న ఆమె పరిస్థితి వేగంగా క్షీణించిందని, అందువల్ల ఐదు రోజుల్లోనే చనిపోయినట్లు చెబుతున్నారు. ఆమె వ్యాక్సిన్ కూడా వేయించుకోలేదని ఒకటి కంటే ఎక్కువ వేరియంట్లను శరీరం తట్టుకోవడం మాత్రం చాలా కష్టమని వైద్యులు చెబుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •