ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

10 మి.లీ. గాడిద పాల ఖరీదు రూ.100!!

మహారాష్ట్ర ఉస్మానాబాద్‌లో గాడిద పాలకు భలే గిరాకీ ఉంది. ధర తక్కువగా ఉన్నందు వల్లే ఇంత డిమాండ్‌ ఉందనుకుంటే పొరపాటు! ఈ గాడిద పాలు లీటరు రూ. 10 వేల వరకు అమ్ముతున్నారంటే నమ్మశక్యంగా అనిపించదు కానీ ఉమర్గాకు చెందిన ధోత్రే కుటుంబీకులు దాదాపు 20 గాడిదలతో పాల వ్యాపారం చేస్తూ రెండు చేతులతో సంపాదిస్తున్నారు.

ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడం వల్లే ఈ పాలకు భారీగా డిమాండ్‌ ఉందని, 10 మి.లీ. పాలు రూ.100కు విక్రయిస్తున్నారని, చిన్నపిల్లలకు ఈ పాలు ఎంతో బలాన్నిస్తాయని లక్ష్మీబాయి ధోత్రే తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •