వార్తలు (News)

కొండచరియల కింద చిక్కుకున్న 40 మంది?

హిమాచల్‌ప్రదేశ్‌లో కిన్నౌర్‌ జిల్లాలోని రెకాంగ్‌ పియో – సిమ్లా హైవేపై బుధవారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగి పడడంతో పలు వాహనాల్లో సుమారు 40 మంది వరకు చిక్కుకున్నారు.

కిన్నౌర్‌ నుంచి సిమ్లాకు వెళ్తోన్న హమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వ రవాణాకు చెందిన ఓ ప్రయాణికుల బస్సు, ఓ ట్రక్కు, కొన్ని కార్లు కొండచరియల కింద చిక్కుకున్నట్లు, ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టినట్టుగా తెలుస్తుంది. అయితే కొండపై నుంచి రాళ్లు ఇంకా పడుతుండటంతో సహాయకచర్యలకు ఆటంకం కలుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •