టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

APSSDCలో మరో భారీ ఉద్యోగ మేళా!!

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ మరో సారి భారీగా మొత్తం 200 ఖాళీలను భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మిషన్ ఆపరేటర్ విభాగంలో ఈ నియామకాలను చేపట్టి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. రిజిస్టర్ చేసుకోవడానికి ఈ నెల 16ని ఆఖరి తేదీగా అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 18న నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.

టెన్త్ పాస్, ఇంటర్ పాస్/ఫెయిల్, ఐటీఐ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18-30 ఉండాలి. కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 11,500 వేతనం ఉంటుంది.

రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 18న vignan Degree College, Bangarupalem, Chittoor Dist, A.P చిరునామాలో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు Amara Raja Growth Carridor, Nunegundlapalli చిరునామాలో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి సబ్సిడీపై ఫుడ్, వసతి ఉంటుంది. అభ్యర్థులు షిఫ్ట్ ల విధానంలో పని చేయాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలకు 9505023016 నంబర్ ను సంప్రదించాలని కోరుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    30
    Shares
  • 30
  •  
  •  
  •  
  •