జాతీయం (National) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఏటీఎంలలో నగదు ఉంచవలసిన బాధ్యత బ్యాంకులదే.. రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం!!

ఏటీఎంలలో డబ్బులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుని యంత్రాల్లో నగదు అందుబాటులో లేని సమయం నెలకు 10 గంటలు దాటితే, బ్యాంకులకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తామని ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి తాజా నిబంధన అమల్లోకి వస్తుందని, ఏటీఎంలు ఖాళీ అయిన వెంటనే బ్యాంకులు తిరిగి డబ్బు నింపకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తమ దృష్టికి వచ్చిన నేపధ్యం లోనే ఆర్‌బీఐ తెలిపింది.

ఈ నేపథ్యంలో వాటిలో నోట్ల లభ్యతను పర్యవేక్షించే వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిందిగా బ్యాంకులు, వైట్‌ లేబుల్‌ ఏటీఎం (డబ్ల్యూఎల్‌ఏ) ఆపరేటర్లను ఆదేశించినట్లు, డబ్ల్యూఎల్‌ఏల్లో నగదు అందుబాటులో లేని వాటికి డబ్బు అందజేసే బాధ్యతను కలిగి ఉన్న బ్యాంకులకు జరిమానా విధిస్తామని ఆర్‌బీఐ తెలిపింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •