అంతర్జాతీయం (International) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

గూగుల్‌, ఫేస్ బుక్ లాంటి కంపెనీల ఉద్యోగుల వేతనాల్లో కోత!

గూగుల్‌ కంపెనీ జూన్‌లో తీసుకొచ్చిన ‘వర్క్‌ లొకేషన్‌ టూల్‌’ ప్రకారం ఉద్యోగుల్లో శాశ్వతంగా ‘ఇంటి నుంచి పని’ విధానాన్ని ఎంచుకున్న వారికి వేతనాలు తగ్గనున్నాయి. సిలికాన్‌ వ్యాలీలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రక్రియను ఇతర పెద్ద కంపెనీలూ పాటిస్తున్నాయి. ఫేస్‌బుక్, ట్విటర్‌ లంతో సంస్థలు సైతం తక్కువ వ్యయాలుండే ప్రాంతాలకు మారిన ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నాయి. రెడిట్, జిల్లో వంటి చిన్న కంపెనీలు కూడా ప్రాంతం ఆధారిత చెల్లింపుల నమూనాకు మారాయి.

ఆల్ఫాబెట్‌ ఇంక్‌కు చెందిన గూగుల్‌ తన ఉద్యోగుల కోసం ఒక కాలిక్యులేటర్‌ను రూపొందించింది. దీని ద్వారా ఉద్యోగులు ఏ ప్రాంతానికి వెళితే వేతనాల్లో ఏ మార్పులు చోటుచేసుకుంటాయన్నది తెలుసుకోవచ్చు. ‘మా వేతన ప్యాకేజీలన్నీ ప్రాంతం ఆధారంగానే నిర్ణయిస్తాం. స్థానిక మార్కెట్లోని ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాన్నీ ఇస్తుంటామ’ని గూగుల్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •