టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

చెల్లెలికి కిడ్నీఇవ్వాలంటే భార్య అనుమతి కావాలా??

సికింద్రాబాద్‌కు చెందిన అన్నాచెల్లెళ్లు కె.వెంకటనరేన్‌, బి.మాధురి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ విచారణ చేపట్టి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న తన సోదరికి కిడ్నీ ఇవ్వడానికి అంగీకరించానని, జులై 30న ఆపరేషన్‌ నిర్వహిస్తున్నట్లు అపోలో ఆసుపత్రి పేర్కొందని పిటిషనర్‌ నరేన్‌ పేర్కొన్నారు.

కిడ్నీ మార్పిడికి తన భార్య వల్లి అనుమతి అవసరమంటూ అపోలో అధీకృత కమిటీ నోటీసు పంపడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు, తన భార్యతో అభిప్రాయభేదాలున్నాయని, వివాహాన్ని రద్దు చేయాలని కోరుతూ కింది కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయాన్ని అపోలో ఆస్పత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేదని, రోజురోజుకు చెల్లెలి ఆరోగ్యం క్షీణిస్తోందని వివరించడంతో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి… ప్రత్యేక పరిస్థితుల్లో పిటిషనర్‌ భార్య అనుమతి కోసం ఒత్తిడి తీసుకురావద్దని, ఆపరేషన్‌ నిర్వహించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •