అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) జాతీయం (National) వార్తలు (News)

అఫ్గాన్‌లో ఉన్న భారతీయులు వెనక్కి వచ్చేయండి!!

తాలిబాన్లకు, దేశ బలగాలకు మధ్య జరుగుతున్న హింసాత్మక పోరులో సాధారణ పౌరులు బలవుతూ అఫ్గాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. తాజాగా బాల్ఖ్‌ ప్రావీన్స్‌లోని మజార్‌- ఏ- షరీఫ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తాలిబాన్లు ప్రకటించడంతో భారత రాయబార కార్యాలయం అప్రమత్తమై ఆ ప్రాంతం, పరిసరాల్లో ఉన్న భారతీయులను వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాలని సూచించింది. మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానం అందుబాటులో ఉంచినట్లు చెప్పింది. రాయబార కార్యాలయంలోని సిబ్బందీ చేరుకునే అవకాశం ఉంది. మజార్‌- ఏ- షరీఫ్‌ అఫ్గాన్‌లోని నాలుగో పెద్ద నగరం.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •