టెక్నాలజీ (Technology) వార్తలు (News)

కవాసకి నింజా 650 మోడల్ విడుదల!!

ఇండియా కవాసకి మోటార్‌(ఐకేఎం) రాబోయే పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని నింజా 650, 2022 ఎడిషన్‌ను బుధవారం మార్కెట్ లోకి తీసుకు వచ్చింది. దీని ధర రూ.6.61 లక్షలు(ఎక్స్‌షోరూం దిల్లీ)గా నిర్ణయించింది. 2021 ఎడిషన్‌తో పోలిస్తే తాజా ఎడిషన్‌ ధర రూ.7,000 అధికంగా నిర్ణయించారు. కొత్తగా విడుదల చేసిన ఈ 2022 ఎడిషన్‌ బైక్‌ పర్ల్‌ రొబోటిక్‌ వైట్‌, లైమ్‌ గ్రీన్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. అయితే కొత్తగా మెకానికల్‌గా పెద్దగా మార్పులేమీ చేయలేదు. సెప్టెంబరు నుంచి వీటిని వినియోగదారులకు అందజేస్తామని, ఈ బైక్‌ 649 సీసీ, ప్యారలల్ ట్విన్‌, లిక్విడ్‌ కూల్‌ ఇంజిన్‌ 67.4 బీహెచ్‌పీ పవర్‌, 64ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 15 లీటర్ల ఇంధన ట్యాంక్‌ గల ఈ బైక్‌ బరువు 196 కిలోలుగా ఉన్నట్టు, ఇప్పటికే ఈ బైక్‌ బుకింగ్‌లు ప్రారంభమైనట్లు కంపెనీ తెలిపింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •