అంతర్జాతీయం (International) వార్తలు (News)

విమాన టికెట్ల ధరలు అధికారిక వెబ్‌సైట్‌లో చూడండి!!

అంతర్జాతీయ ప్రయాణికులు విమాన టికెట్ల ధరల విషయంలో మెటా సెర్చ్‌ ఇంజిన్లలో వాస్తవమైన ధరలు ఉండకపోవచ్చని, టికెట్ల ధరలను నేరుగా విమానయాన వెబ్‌సైట్లలోనే చూసుకోవాలని డీజీసీఏ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్స్‌) ప్రయాణికులకు సూచించింది.

బ్రిటన్‌లో కళాశాలల అడ్మీషన్‌ సీజన్‌ కావడంతో లండన్‌కు వెళ్లే విమాన టికెట్ల ధరలను ఇటీవల ఆయా విమానయాన సంస్థలు భారీగా పెంచేశాయంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ-లండన్‌ మార్గంలో బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ టికెట్‌ ధర ఆగస్ట్‌ 26వ తేదీకి రూ.3.95 లక్షలు పలుకుతోందని కేంద్ర హోంశాఖ ఇంటర్‌స్టేట్‌ కౌన్సిల్‌ సెక్రెటేరియట్‌ సెక్రెటరీ సంజీవ్‌ గుప్తా ట్వీట్ చేయడంతో దీనిపై పౌరవిమానయాన శాఖ స్పందిస్తూ ఆగస్టు నెలలో ఢిల్లీ-లండన్‌ మధ్య ఎకానమి క్లాస్‌ టికెట్‌ ధర రూ. 1.03లక్షల నుంచి రూ. 1.47లక్షలు మాత్రమే ఉంటుందని చెప్పింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •