ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

కరోనా వైరస్ వ్యాక్సీన్ చేతికే ఇవ్వాలా??

కోవిడ్-19 వ్యాక్సీన్లు చేతికే ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే.. వ్యాక్సీన్లు శరీరంలో యాంటీబాడీలను క్రియాశీలం చేయాలంటే కండరాలు లేదా కణజాలం అవసరం అవుతుంది. ఇవి మనకు చేతి కండరాల్లో చక్కగా దొరకుతాయి. చేతి కండరాల్లో మనకు చాలా నరాలు ఉంటాయి. రక్తం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ వ్యాధి నిరోధక కణాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాక్సీన్లతో కలిసి పనిచేసేవి ఈ కణాలే కాబట్టి చేతికే ఈ వాక్సిన్ లు ఇస్తున్నారు.

మోడెర్నా లేదా ఫైజర్ లాంటి ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సీన్లు అయినా లేదా జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి డీఎన్‌ఏ వ్యాక్సీన్లు అయినా వ్యాధి నిరోధక కణాల సాయంతోనే పనిచేస్తాయి’’ అలాగే చైనా వ్యాక్సీన్ సినోవ్యాక్‌తోపాటు రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ వి కూడా ఈ రోగ నిరోధక కణాల సాయంతోనే పనిచేస్తుంది. వైరస్‌పై దాడిచేయడంలో ప్రధాన పాత్ర పోషించే టీ కణాలు, బీ కణాలను క్రీయాశీలం చేయడమే వ్యాక్సీన్ లక్ష్యం.

అందుకే ఈ వ్యాక్సీన్లను రక్త నాళాల ద్వారా నేరుగా రక్తంలోకి ఇవ్వడాన్ని చాలా మంది నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే రక్తంలో పెద్ద సంఖ్యలో వ్యాధి నిరోధక కణాలు ఉండవు. మరోవైపు వ్యాక్సీన్‌లోని పదార్థాలు రక్తంలో త్వరగా కరిగిపోయే ముప్పు కూడా ఉంటుంది’’ కాబట్టి వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు డెల్టాయిడ్ కండరాల్లోకి వ్యాక్సీన్ ఇస్తే మెరుగైన వ్యాధి నిరోధక స్పందనలు ఉంటాయని, వ్యాక్సీన్లతో వచ్చే దుష్ప్రభావాలు కూడా తగ్గుతాయని కూడా చెప్తున్నారు.

పిరుదులు, తొడలు లాంటి కండరాలు ఎక్కువగా ఉండే శరీర భాగాల్లోనూ ఈ వ్యాక్సీన్లు వేయొచ్చని, ఉదాహరణకు పిల్లలకు కొన్ని కండరాలకు ఇచ్చే వ్యాక్సీన్లను పిరుదులకు ఇస్తారు. ఎందుకంటే వారికి అక్కడే ఎక్కువ కండరాలు ఉంటాయి.పెద్దవారికి కూడా పిరుదులకు ఇవ్వొచ్చు. అయితే, అందరికీ పిరుదుల్లో ఇవ్వడం సరికాదు. ఎందుకంటే కొంత మందికి శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అలా కొవ్వు పేరుకున్న చోట్ల వ్యాక్సీన్ అంత ప్రభావవంతంగా పనిచేయదు అని మరికొంత మంది నిపుణులు అభిప్రాయం పడుతున్నారు.

అలాగే కొవ్వులో వ్యాక్సీన్ ఇస్తే, వ్యాధి నిరోధక కణాలకు యాంటీజెన్లు చేరడంలో ఆలస్యం అవుతుంది. ఫలితంగా వ్యాధి నిరోధక స్పందనలను కలగజేయడం కూడా ఆలస్యం అవుతుంది’ అని మరోవైపు టీకా వేయడానికి కూడా చేతి భుజం అయితే సులువుగా ఉంటుందని ఆయన వివరించారు. వ్యాక్సినేషన్ వేయడానికి సదరు వ్యక్తి వస్త్రాలను ఎక్కువగా తొలగించాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ఆఖరికి 200ఏళ్ల అనుభవంతో చేతి కండరాలకు వేయడం ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చినట్లు వివరిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •