టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

వివాహాల నమోదుపై సుప్రీం తీర్పు!!

సాంకేతికతను నేడు అన్ని రంగాలు అందిపుచ్చుకుంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో చట్టాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. స్పెషల్‌ మ్యారేజ్‌ పేరుతో వస్తున్న చట్టంతో వివాహాల నమోదు ప్రక్రియను మరింత సులభం చేయాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. కొత్త చట్టం ఆధారంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కూడా వివాహాల రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. వరుడు, వధువు ఇద్దరూ ఆన్‌లైన్‌ ద్వారా అందుబాటులోకి వచ్చి పెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ వి. రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం తాజాగా తెలిపింది.

ఇంతకీ ఏంజరిగిందంటే.. యూకేలో ఉంటున్న ఓ ఐటీ ఉద్యోగి, యూఎస్‌లో ఉంటున్న ఓ వైద్యురాలు 2019 డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వివాహ నమోదు కోసం ప్రయత్నించారు. దీని కోసం 2020 ఏప్రిల్‌ 3న తమ ఎదుట హాజరవ్వాలని అధికారులు కోరారు. అయితే కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల విమానాలు రద్దు కావడంతో వారు హాజరు కాలేకపోయారు. దీంతో ఆగస్టు 2020న ఆ జంట ఆన్‌లైన్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరవుతామని, వివాహ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని కోరారు. కానీ సంబంధిత అధికారి ఇందుకు నిరాకరించారు. దీంతో యూకేలో ఉంటున్న వ్యక్తి పంజాబ్‌ అండ్‌ హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. యూఎస్‌లో ఉన్న తన భార్యను కలవడానికి వివాహ ధ్రువీకరణ పత్రం అవసరమని, కానీ ఆన్‌లైన్‌లో తన భార్య హాజరును అధికారులు అంగీకరించడం లేదని అప్పీల్‌లో పేర్కొన్నారు. ఆమె ఇప్పుడు కొవిడ్ డ్యూటీలో ఉందని చెప్పినా వినడం లేదని చెప్పారు. ఈ అప్పీల్‌ను సింగిల్‌ జడ్జి బెంచ్‌ కొట్టివేసింది. వివాహ నమోదు చట్టంలో ఇలాంటి ప్రొవిజన్‌ లేదని చెప్పింది. అయితే ఆ ఐటీ ఉద్యోగి ఇద్దరు జడ్జిల బెంచ్‌ను ఆశ్రయించారు. అక్కడ ఉద్యోగికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే దానిపై హర్యానా ప్రభుత్వం సుప్రీం కోర్టుకి వచ్చింది. ఇక్కడ సుప్రీం ఆన్‌లైన్‌ అప్పీరియెన్స్‌ను సమర్థిస్తూ అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ దూసుకెళ్తున్న ఈ రోజుల్లో చట్టం కూడా టెక్నాలజీని తోడు తెచ్చుకోవాలి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    8
    Shares
  • 8
  •  
  •  
  •  
  •