క్రైమ్ (Crime) జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నేరచిట్టా వెల్లడించవలసిందే!!

రాజకీయ వ్యవస్థను నేర రహితంగా మార్చే దిశగా అత్యున్నత న్యాయస్థానం కీలక అడుగులు వేసింది. ఇప్పటికే నేర చరితులకు రాజకీయ పార్టీలు టిక్కెట్లను కేటాయించే విషయంలో పలుమార్లు ఆదేశాలు జారీ చేసిన, హెచ్చరించిన ఫలితం లేకపోవడంతో ప్రస్తుతం మళ్ళీ సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలు జరీ చేస్తూ ఎన్నికల్లో పోటీచేసే తమ అభ్యర్థులను ప్రకటించిన 48 గంటల్లోగా వారి నేరచిట్టాను పార్టీలు వెల్లడించాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించేందుకు హైకోర్టుల ఆమోదం లేకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలపై క్రిమినల్ కేసుల్ని ఉపసంహరించడం వీలుకాదని, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎంపికైన అభ్యర్థులు 48గంటల్లో తమ నేర చరిత్రకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని లేకపోతే నామినేషన్ దాఖలు చేయడానికి అనుమతించిన తేదీకి కనీసం రెండు వారాల ముందు ఈ వివరాలను బహిర్గతం చెయ్యాలని ఆదేశించింది.

పార్టీలు నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల్ని ఎందుకు ఎంచుకుంటున్నాయో కారణం చెప్పాలని, కేసుల వివరాల్ని వెబ్‌సైట్‌లో పెట్టాలని, అభ్యర్థుల వివరాలను కూడా దినపత్రికల్లో ప్రచురించాలని రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది.

తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను ఎన్నికలలో పోటీ చేయకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాజకీయ పార్టీల గుర్తులను రద్దుచేస్తామని ఎన్నికల కమిషన్ ఈ సందర్భంగా వివరించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •