రాజకీయం (Politics) వార్తలు (News)

ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వివరణ ఇవ్వాల్సిన బాధ్యత అధికార పార్టీదే!!

కాంగ్రెస్‌ పార్టీ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కుమార్‌ ఇంద్రవెల్లి సభ విజయవంతమైందని, పెద్ద సంఖ్యలో దళిత, గిరిజన ప్రజలు సభకు తరలివచ్చారని, దీంతో తెరాసకు చురుకు తగిలిందని అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కొంత మంది ప్రజాప్రతినిధుల విచక్షణ కోల్పోయి నోటికొచ్చినట్లు మాట్లాడటం సరి కాదన్నారు.

కొంత మంది నేతలు నాలుకలు కోస్తామంటూ ఇష్టం వాచినట్టు మాట్లాడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కత్తులు, కటారులు పట్టుకొని తిరుగుతున్నారా? మాకు కత్తులు దొరకవా? మేము నాలుకలు కోయలేమా? అవినీతికి పాల్పడిన నేతలు జైలుకు వెళ్లడం ఖాయం. సమస్యలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వివరణ ఇవ్వాల్సిన బాధ్యత అధికార పార్టీపై ఉంటుంది. కొంత మంది నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఎదురు దాడులు చేస్తున్నారు అన్నారు.

తెల్ల రేషన్ కార్డు బియ్యం తెచ్చుకుని తినేవారికి బెంజ్ కార్లు ఎలా వచ్చాయి? రేవంత్ రెడ్డి జైలుకు వెళతారని అంటున్నారు. మీ భాగోతాలు మాకు తెలియవా?మేము బైట పెట్టలేమా? ఏడేళ్లుగా దళిత, గిరిజన ప్రజల నోట్లో మట్టి కొట్టారు. పథకాల పేరుతో ఇవాళ ప్రజలను మభ్య పెడుతున్నారు. సమష్యలపై చర్చించేందు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉంది’’ అని దాసోజు అధికార పార్టీ ని దుయ్యబట్టారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    83
    Shares
  • 83
  •  
  •  
  •  
  •