జాతీయం (National) వార్తలు (News)

వివాహితకు ప్రేమలేఖ రాయడమంటే ఆమె నిబద్ధతను శంకించడమే!!

హైకోర్టులోని నాగ్‌పుర్‌ ధర్మాసనం వివాహితకు ప్రేమలేఖ పంపిన వ్యక్తికి రూ.90 వేల జరిమానా విధించి అందులో రూ.85 వేలు బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఒక కిరాణం షాపు యజమాని అక్కడ పనిచేసే వివాహితకు ప్రేమలేఖ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఆమె తిరస్కరించడంతో ‘ఐ లవ్‌ యూ’ అంటూ ఆ చిట్టీని ఆమెపై విసిరి వెళ్లాడు. ఆ మర్నాడు మళ్లీ పిచ్చిచేష్టలతో ఆమెను విసిగించి, ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. దీంతో బాధితురాలు అకోలాలోని సివిల్‌లైన్‌ పోలీస్‌స్టేషనులో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు అనంతరం నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

2018 జూన్‌ 21న సెషన్స్‌ కోర్టు నిందితుడికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.40 వేల జరిమానా విధించగా ఈ తీర్పును సవాలు చేస్తూ అతడు హైకోర్టును ఆశ్రయించి 2011లో మహిళ తనపై తప్పుడు ఫిర్యాదు చేసిందని, తన షాపులో సరకులు తీసుకొని డబ్బులు చెల్లించలేదని, ఆ డబ్బు అడిగినందుకే ఇలా అభియోగాలు మోపిందని వాదించగా వాదనలు విన్న ధర్మాసనం వాటిని తోసిపుచ్చుతూ ఆధారాలు పక్కాగా ఉన్నాయని సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఇలా చేయడం ఆమె నిబద్ధతను శంకించడమేనని స్పష్టం చేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •