అంతర్జాతీయం (International) జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

హైదరాబాద్‌ టూ లండన్‌ నాన్‌స్టాప్‌ విమాన సేవలు!!

శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా లండన్‌కు వెళ్లాలనుకునేవారి కోసం ఎయిర్‌ ఇండియా ఇవాళ్టి నుంచి నాన్‌స్టాస్‌ విమాన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌ నుంచి నేరుగా లండన్‌కు వారంలో రెండు రోజులు సోమ, శుక్రవారాల్లో ఈ విమాన సేవలు అందుబాటులో ఉంటాయి. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరే ఎయిర్‌ ఇండియా నాన్‌స్టాప్‌ విమానం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి కేవలం తొమ్మిది గంటల సమయంలోనే చేరుకుంటుందని ఎయిర్‌ఇండియా అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతోపాటు సమీప రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు కూడా ఈ సేవలను ఉపయోగించుకునేందుకు అవకాశం ఏర్పడిందని ఎయిర్‌ ఇండియా సంస్థ అధికారులతోపాటు శంషాబాద్‌ జీఎంఆర్‌ విమానాశ్రయం అధికారులు అభిప్రాయపడ్డారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •