టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఏపీపీఎస్సీ డిపార్ట్ మెంటల్ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల!!

రాష్ట్రంలో ప్రస్తుతం చర్చాంశమైన వార్డు-గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్షల పైన ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగులకు డిపార్ట్ మెంటల్ పరీక్షలు నిర్వహిస్తామనే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఈ నోటిఫికేషన్ జారీ అయినట్టు, ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ డిపార్ట్ మెంటల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తన నోటిఫికేషన్ లో వెల్లడించి దీనికి సంబంధించి దరఖాస్తు విధానం పైన స్పష్టత ఇచ్చింది.

ఎవరైతే ఉద్యోగులు ఈ పరీక్షలకు హాజరవుతారో, వారంతా ముందు ఏపిపిఎస్సీ వెబ్ సైట్ లో ఆయా ఉద్యోగులు ఓటిపిఆర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వారికి ఓటిపిఆర్ లో వచ్చే యూజర్ ఐడితో అన్ లైన్ లో ధరకాస్తుకు చేసుకోవాలని, ఈ నెల 13 నుండి 17 వరకు అన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉన్నట్లుగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ లో పేర్కొంది. ఈ పరీక్షలు మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తుండగా దానిలో 40 మార్కులు పైగా వచ్చిన ఉద్యోగులకు మాత్రమే ప్రొబేషనరీకి అర్హత సాదించనున్నారు.

ఏపిలో గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పడి వచ్చే అక్టోబర్ 2 నాటికి రెండేళ్లు పూర్తి కానుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15004 గ్రామ,వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల మంది ఉద్యోగులకు ఏపిపిఎస్సీ డిపార్మెంట్ పరీక్షలు నిర్వహిస్తుంది. ఎవరైతే ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఉత్తీర్ణత శాతం సాధిస్తారో..అలాంటి ఉద్యోగులకి ప్రోబేషనరీని ప్రభుత్వం డిక్లైర్ చేయనుంది. అయితే, వార్డు సిబ్బంది తమ పరిధిలోని సాధారణ ప్రజలకు అందించే సేవల పైన ఎటువంటి ప్రభావం పడకుండా ఈ షెడ్యూల్ ప్రకటనలో జాగ్రత్తలు తీసుకున్నారు.

అంతే కాకుండా రెండేళ్ల కాలం చేసిన ఈ ఉద్యోగులకు ప్రొబేషనరీ డిక్లేర్ చేయటం ద్వారా వారికి ఉద్యోగాలకు మరింతగా భరోసా దొరకుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పుడు పాలనా పరంగా ముఖ్యమంత్రి జగన్ ప్రతీ అంశంలోనూ వార్డు -సచివాలయ వ్యవస్థ గురించే ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వం – ప్రజల మధ్య వారధిగా సచివాలయ వ్యవస్థ పని చేయాలనేది సీఎం లక్ష్యంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో రానున్న రోజుల్లో మరిన్ని సేవలను అందించటంతో పాటుగా..జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు సైతం తమ పరిధిలోని సచివాలల్లో తనిఖీలు నిర్వహించాలని సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసారు. వచ్చే అక్టోబర్ రెండో తేదీ నుంచి మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నట్టుగా సమాచారం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •