వార్తలు (News)

ఖైరతాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఎప్పటివరకు అంటే??

గణేశ్‌ ఉత్సవాల నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో రానుండటంతో ఖైరతాబాద్‌లో ఈనెల 19వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. భక్తులు సొంత వాహనాల్లో రావొద్దని, మెట్రో, ఎంఎంటీఎస్‌లలో రావాలని ట్రాఫిక్‌ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. హెచ్‌ఎండీఏ పార్కింగ్‌ స్థలంలో వాహనాలకు, వృద్ధులు, నడవలేని వారి వాహనాలకు మింట్‌ కాంపౌండ్‌లో పార్కింగ్‌కు అనుమతిచ్చారు. ఖైరతాబాద్‌ ప్రధాన రహదారిలో బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు.

హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఖైరతాబాద్‌ 40 అడుగులతో ‘పంచముఖ రుద్ర మహాగణపతి’ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భారీగా భక్తులు తరలి వస్తుండటంతో ఖైరతాబాద్‌ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •