ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

ఆడపిల్లలకు క్యాన్సర్ పరీక్ష తప్పనిసరి!!

హైదరాబాద్ లోని ఎమ్ ఎన్ జె క్యాన్సర్ హాస్పటల్ ఆధ్వర్యంలో శనివారం జలవిహార్ నుంచి టోల్ప్లాజా వరకు బ్రెస్ట్ క్యాన్సర్ పై నిర్వహించిన అవేర్నెస్ వాక్ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా అవగాహనతోనే క్యాన్సర్ నివారణ సాధ్యమని, ఆ బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, గతంలో 60 ఏండ్ల పైబడిన వాళ్లకు వచ్చే క్యాన్సర్ ఇప్పుడు 30 సంవత్సరాలకే వస్తుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కుటుంబ సభ్యుల మీద కూడా ఉందన్నారు. ఆడపిల్లలకు తప్పకుండా ఏడాదికి ఒకసారి క్యాన్సర్ పరీక్షలు చేయించడంతో పాటు, జీవితంలో ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రతి వ్యక్తి తల్లి, చెల్లి, భార్య ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కోరారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •