టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

దసరా ప్రత్యేక రైళ్లు!!

రద్దీ మార్గాల్లో ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే పలు ప్రత్యేక పూజా స్పెషల్‌ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి వెల్లడించారు. విశాఖపట్నం-సికింద్రాబాద్‌(08579) వీక్లీ అక్టోబర్‌ 13, 20, 27 తేదీల్లో విశాఖపట్నంలో రాత్రి 7కు బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 7గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో(08580) సికింద్రాబాద్‌లో అక్టోబర్‌ 14, 21, 28 తేదీల్లో రాత్రి 7.40కు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది

విశాఖపట్నం-తిరుపతి(08583) వీక్లీ విశాఖపట్నంలో అక్టోబర్‌ 18, 25, నవంబర్‌ ఒకటి తేదీల్లో రాత్రి 7.15 బయలుదేరి మరుసటి రోజు ఉద యం 7.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో(08584) తిరుపతిలో అక్టోబర్‌ 19, 26, నవంబర్‌ 2 తేదీల్లో రాత్రి 9.55 బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 10.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం-సికింద్రాబాద్‌(08585) స్పెషల్‌ విశాఖపట్నంలో అక్టోబర్‌ 19, 26, నవంబర్‌ 2 తేదీల్లో సాయంత్రం 5.35 బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో(08586) సికింద్రాబాద్‌లో అక్టోబర్‌ 20, 27, నవంబరు 3 తేదీల్లో రాత్రి 9.05 గంటలకు ప్రయాణం మొదలు పెడుతుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    35
    Shares
  • 35
  •  
  •  
  •  
  •