ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

ఏఆర్‌టీ సెంటర్లలో హెచ్‌ఐవీ బాధితులకు హెపటైటిస్‌ వ్యాక్సిన్‌!!

వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే హెచ్‌ఐవీ బాధితులకు వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉండడంతో ఆంధ్రప్రదేశ్‌లోని హెచ్‌ఐవీ బాధితులందరికీ హెపటైటిస్‌ వ్యాక్సిన్‌ వేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న హెపటైటిస్‌ బాధితుల్లోనూ హెచ్‌ఐవీ సోకిన వారే ఎక్కువగా ఉన్నారని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.90 లక్షల మంది హెచ్‌ఐవీ బాధితులుండగా వీరంతా రాష్ట్రంలోని 45 యాంటీ రిట్రోవైరల్‌ టెస్టింగ్‌ (ఏఆర్‌టీ) సెంటర్లలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సెంటర్లలోనే వీరికి వ్యాక్సిన్‌ వేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అలాగే బోధనాస్పత్రుల్లో కూడా వ్యాక్సిన్‌ వేస్తారు. ముందుగా వైద్య పరీక్షలు చేసిన తర్వాత వ్యాక్సిన్‌ వేయాలని ఆదేశాలిచ్చారు. వైద్య పరీక్షలు చేశాక హెపటైటిస్‌ ఉందని భావిస్తే వారిని వెంటనే మోడల్‌ ట్రీట్‌మెంట్‌ సెంటర్లకు పంపించి వైద్యమందిస్తారు. ముందుగా ఏఆర్‌టీ సెంటర్లలో పనిచేస్తున్న వైద్య అధికారులందరికీ ప్రత్యేక శిక్షణ ఇస్తారు. టెస్టులు, చికిత్సలకు సంబంధించిన సాంకేతిక సహకారాన్ని జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ అందిస్తుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •