జాతీయం (National) వార్తలు (News)

జీవితకాల గరిష్ఠాలకు చేరుకున్న సూచీలు!!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమై క్రమంగా పుంజుకుని ఇంట్రాడేలో జీవితకాల గరిష్ఠాల్ని నమోదు చేశాయి. సెన్సెక్స్‌ ఉదయం 60,099.68 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమై ఇంట్రాడేలో 60,476.13 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకి చివరకు 76.72 పాయింట్ల పెరిగి 60,135.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 18,000 మార్కును తొలిసారి దాటి చివరకు ఇంట్రాడే లాభాలను కోల్పోయిన సూచీలు నష్టాల్లోకి మాత్రం జారుకోకుండా 50.75 పాయింట్లు ఎగబాకి 17,945.95 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, ఐటీసీ, ఎస్‌బీఐ, ఎంఅండ్‌ఎం, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్, కొటాక్‌మహీంద్రా బ్యాంక్‌, సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, బజాజ్‌ ఫినాన్స్‌, బజాజ్‌ ఆటో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభపడ్డాయి. భారతీఎయిర్‌టెల్‌, టెక్ మహీంద్రా, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, రిలయన్స్‌, ఎల్‌అండ్‌టీ, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ షేర్లు నష్టపోయాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    3
    Shares
  • 3
  •  
  •  
  •  
  •