జాతీయం (National) వార్తలు (News)

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే??

దేశంలో లీటర్​ పెట్రోల్​ ధర వంద రూపాయలు దాటి రూ.110కి చేరువగా వెళుతూ వాహనదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పెట్రోల్ , డీజిల్​ కరోనా కాలంలో అమాంతం పెరిగాయి. హైదరాబాద్‌ లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.0.31 పైసలు పెరిగి రూ.108.83 అయింది. రూ.100.51 గా ఉన్న డీజిల్ ధర.. ప్రస్తుతం రూ.101.27కి చేరింది. వరంగల్ రూరల్ జిల్లాలో 107.85 గా ఉంది. డీజిల్ ధర రూ.100.81 గా ఉంది. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర రూ.0.49 పైసలు పెరిగి రూ.108.02గా ఉంది. డీజిల్ ధర రూ.100.98 గా ఉంది. కరీంనగర్‌ లో పెట్రోల్ ధర రూ.108.21గా ఉంది. డీజిల్ ధర రూ.0.11 పైసలు పెరిగి రూ.101.15 కు చేరింది. నిజామాబాద్‌ లోనూ ఇంధన ధరలు కాస్త తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.34 పైసలు పెరిగి రూ.110.05 గా ఉంది. డీజిల్ ధర రూ.0.41 పైసలు పెరిగి రూ.102.87 గా ఉంది.

విజయవాడలో పెట్రోల్ ధర రూ.110.39 గా ఉంది. డీజిల్ ధర రూ.0.13 పైసలు పెరిగి రూ.102.74కు చేరింది. విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.110.24గా ఉంది. గత ధరతో పోలిస్తే రూ.0.54 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.102.57గా ఉంది. తిరుపతిలో ఇంధన ధరల్లో తగ్గుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.0.36 పైసలు పెరిగి.. రూ.110.60 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఇక డీజిల్ ధర రూ.102.91గా ఉంది. డీజిల్ ధర లీటరుకు ఏకంగా రూ.0.39 పైసలు పెరిగింది. న్యూఢిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ. 104.14, కోల్‌కతా రూ. 104.80 , ముంబై రూ. 110.12, చెన్నై రూ. 101.51, గుర్గావ్ రూ. 101.44, నోయిడా రూ. 101.40, బెంగళూరు రూ. 107.77, జైపూర్ రూ. 112.06, లక్నో రూ. 101.18 భువనేశ్వర్ రూ. 103.27, పాట్నా రూ107.29 గా ఉంది. త్రివేండ్రం రూ. 105.96 గా ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    17
    Shares
  • 17
  •  
  •  
  •  
  •