ఆదిలాబాద్.. 11.11.20.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలోని దిగిడ గ్రామం సమీపంలోని వాగులో చేపల వేటకు వెళ్ళిన పులి
ఇద్దరు యువకుల పై దాడి చేసి సిడెం విగ్నేష్
23సం యువకున్ని నోట్లో పెట్టుకొని ఒక్క సారిగా అడవిలోకి లాక్కెళ్ళడంతో. అది చూసి భయాందోళనకు గురి అయిన మరో యువకుడు వెంటనే కుంటు గ్రామంలోకి పరుగెతుకుంటు వెళ్లి గ్రామస్తులకు పులి దాడి జరిగిన విషయం తెలుపడంతో గ్రామస్తులు అడవిశాఖ అధికారులకు విషయం తెలిపి. గ్రామంలోని ప్రజలు కొంత్త మంది అడవిలో గాలిస్తుండగా గ్రామస్తులను గమనించిన పులి విగ్నేష్ మృత దేహాన్ని అక్కడే వదిలి అడవిలోకి పారిపోయింది. అక్కడికి చేరుకున్న అటవిశాఖ అధికారులు పులి జాడ కోసం వెతుకుతున్నారు…. ఇప్పటివరకు ఆవుల పై మేకల పై దాడి చేసిన పులి ఈరోజు యువకుడి పై దాడి చేసి చంపడం తో గ్రామస్థులు బయన్దోళనకు గురౌతున్నారు….