వార్తలు (News)

ప్రాణాలు తీస్తున్న ఐపిఎల్ క్ర‌కికెట్ బెట్టింగ్‌

గుంటూరు జిల్లా

ప్రాణాలు తీస్తున్న ఐపిఎల్ క్ర‌కికెట్ బెట్టింగ్‌

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ లో దిగి భారీగా నష్టపోయిన ఇద్దరు యువకులు ఆత్మహత్యకు ప్రయత్నించారు. వీరిలో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం త్యాళ్లూరు గ్రామానికి చెందిన ఊర ఐలోని కుమారుడు సురేష్ (22), బెల్లంకొండ బుడగ జంగాల కాలనీకి చెందిన ఊర శంకర్ కుమారుడు కొమరయ్య(21) సోమవారం మధ్యాహ్నం బెల్లంకొండలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. అప్పటికే దారిలో పురుగుల మందు తాగారు.

క్రికెట్ బెట్టింగ్ లో రూ. లక్షల్లో నష్టపోయామని.. డబ్బులు చెల్లించాలని బెట్టింగ్ నిర్వాహకుడు ఒత్తిడి తేవడంతో చనిపోవాలని నిర్ణయించుకుని పురుగుల మందు తాగుతున్నామంటూ ఆ వీడియోను బంధువులకు వాట్సాప్ లో పంపించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు ఇద్దరిని సత్తెనపల్లి ఏరియా వైద్యశాళకు ..అక్కడ నుంచి గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం సురేష్ చనిపోగా.. కొమరయ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యలు తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.