వార్తలు (News)

బాణా సంచా దుకాణాల్లో సానిటైజర్లు వినియోగించ కూడదు____ సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్

అమలాపురం,నవంబర్,11

ఉప్పలగుప్తం సచివాలయాన్ని సందర్శించిన సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్

అమలాపురం

గ్రామ సచి వాలయాలకు వివిధ సమస్యల తో విచ్చేసే ప్రజలకు సచివాలయ సిబ్బంది అంకిత భావంతో సేవలు అందించాలని అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ ఆదేశించారు. బుధవారం సబ్ కలెక్టర్ ఉప్పలగుప్తం మండల కేంద్రంలోని నంబర్ 1 గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సచివాలయం లోని సిబ్బందిని శాఖలవారీగా వచ్చిన దరఖాస్తులను,ఎన్ని పరిష్కరించారు,ఇంకనూ పరిష్కారం కావలసిన దరఖాస్తులు, పెండింగ్ కు గల కారణాలను సబ్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు అన్నిటినీ సత్వరం పరిష్కరించాలని సిబ్బందిని సబ్ కలెక్టర్ ఆదేశించారు.

దీపావళి పండుగ సందర్భంగా ప్రతీ బాణా సంచా దుకాణాల్లో కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ తెలియ చేసారు. అయితే సాని టైజర్లు మాత్రం దుకాణాల్లో గాని, దుకాణాల ఆవరణల్లో గాని వినియోగించ కూడదని సబ్ కలెక్టర్ తెలియ చేసారు. కోవిడ్ నిబంధనల్లో భాగంగా ప్రతి షాపు వద్ద చేతులు శుభ్రం చేసుకోవడం కొరకు,మరియు ప్రమాదాల నివారణకు నీటి డ్రమ్ములు ఏర్పాటు చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. సానిటైజర్లు మాత్రం షాపులు వద్ద పూర్తిగా నిషేదమని సబ్ కలెక్టర్ తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.