– 1000 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ప్రభుత్వం

బందరు పోర్టు నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణా, సమాచార శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ఏపి మ్యారీ టైమ్ బోర్డుకు ఆదేశాలిచ్చారు.బందరు పోర్టు నిర్మాణానికి అడ్డంకులన్ని తొలిగిపోయాయని రాష్ట్ర రవాణా, సమాచార శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) హర్షం వ్యక్తం చేశారు. వచ్చే మూడేళ్లల్లో బందరు పోర్టు నిర్మించేందుకు రూ.5835 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన తెలిపారు .ఈ మేరకు ప్రభుత్వం జీఓ.ఎంఎస్ నెం.14 జారీ చేసిందన్నారు. గ్రీన్ ఫీల్టు పోర్టుగా బందరు పోర్టు అభివృద్ధికి రైట్స్ సంస్థ తయారుచేసిన డిపిఆర్ ను ప్రభుత్వం ఆమోదించిందన్నారు .ల్యాండ్ లార్డ్ పద్దతిలో రూ.5835 కోట్లతో 800 ఎకరాల్లో బందరు పోర్టు భారీగా నిర్మించేందుకు ప్రభుత్వం పరిపాలనా ఆమోదం తెలిపిందన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు వ్యయానికి నిధులు కూడా మంజూరు చేసిందన్నారు. అలాగే ఏపి మ్యారీ టైం బోర్డు రూ.4745 కోట్లు బ్యాంకుల ద్వారా బుణ సహాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు పోర్టు మౌళిక సదుపాయాల కల్పనకు 90 కోట్లతో 225 ఎకరాల భూమి సేకరణ చేయాలని ఆదేశించామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఏపి మ్యారీ టైమ్ బోర్డు బందరు పోర్టు నిర్మాణానికి టెండర్లు లోనే పిలుస్తుందన్నారు .స్వర్గీయ వై.యస్.రాజశేఖర రెడ్డి పునాది వేయగా ఆయన తనయుడు ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి బందరు పోర్టు నిర్మాణం 3 ఏళ్లలో పూర్తి చేసేందుకు సంకల్పించారని బందరు వాసుల తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. బందరు వాసుల కల పోర్టు నిర్మాణంతో త్వలోనే పూర్తి కానుందని పేర్ని నాని విశ్వాసం వ్యక్తం చేశారు.

రూ.5835 కోట్లతో 3 ఏళ్లలో బందరు పోర్టు నిర్మాణం – మంత్రి పేర్ని

రైట్స్ సంస్థ తయారు చేసిన డిపిఆర్ ను ఆమోదించిన ప్రభుత్వం