మామిడికుదురు

..గ్రామ సచివాలయానికి ప్రజల నుంచి వివిధ సమస్యల పై వచ్చే దరఖాస్తులను పెండింగ్ లేకుండా సకాలంలో పరిష్కరించాలని అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ సచివాల య సిబ్బందిని ఆదేశించారు. సోమవారం మామిడికుదురు మండలం నగరం గ్రామ స చివాలయాన్ని సబ్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయంలో వివిధ శాఖలకు సంబంధించిన సిబ్బందిని విడివిడి గా ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులు ఎన్ని ,ఎన్ని పరిష్కరించారు,ఎన్ని పెండింగ్ లో వున్నాయి,అందుకు కారణాలు అడిగి తెలుసుకున్నారు.పెండింగ్ లో ఉన్న వాటిని సత్వరం పరిష్కరించాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.అలాగే రైతు భరోసా కేంద్రాన్ని సబ్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులు ఎంతమంది నమోదు అయ్యింది వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు.ప్రతీ రైతు తమ పేర్లు నమోదు అయ్యేలా చూడాలని ప్రభుత్వ లబ్ధి రైతులకు చేకూరాలంటే రైతులు తమ పేర్లను రైతు భరోసా కేంద్రం లో నమోదు చేసుకోవాలని సబ్ కలెక్టర్ సూచించారు.