వార్తలు (News)

330 రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులు

రైతు సంఘాల బృందం అమరావతి రాజధాని పరిరక్షణ కోసం  మహిళలకు వెన్నుదన్నుగా మేమున్నామంటూ దీక్షా శిబిరాలను రెండవ రోజు సందర్శించింది. బృందంలో నాతో పాటు ఆల్ ఇండియా కిసాన్ సభ, ఉపాధ్యక్షులు శ్రీ ఆర్.వెంకయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అధ్యక్షులు శ్రీ వై.కేశవయ్య, రాష్ట్ర రైతాంగ సమాఖ్య, అధ్యక్షులు శ్రీ ఎర్నేని నాగేంద్రనాథ్, తెలుగు రైతు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సెల్, నాయకులు శ్రీ నరహరిశెట్టి నరసింహారావు, ఆ.ప్ర.రైతు సంఘం, కార్యదర్శి శ్రీ మల్నీడు యలమందరావు, గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ యార్లగడ్డ వెంకటేశ్వరావు, ఆ.ప్ర.ప్రజానాట్య మండలి, నాయకులు శ్రీ కాశీ, అమరావతి రాజధాని పరిరక్షణ సమితి, నాయకులు శ్రీ గద్దె బుచ్చి తిరుపతిరావు, తదితరులతో కూడిన రైతు సంఘాల బృందం అబ్బురాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, అనంతవరం, పెదపరిమి, నీరుకొండ దీక్షా శిబిరాలను ఈ రోజు సందర్శించి, సంపూర్ణ మద్ధతు తెలియజేయడం జరిగింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.