ఈరోజు ప్రకాశం జిల్లా మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అవగాహన కొరకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక పాడిపరిశ్రమ అభివృద్ధి మరియు మత్సశాఖ మంత్రివర్యులు *శ్రీ డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు*

ఈకార్యక్రమంలో మంత్రి వర్యులు మాట్లాడుతూ..
అముల్‌ (ఆనంద్‌ మిల్క్‌ యూనియన్‌ లిమిటెడ్‌) గుజరాత్‌ వారు తమ వ్యాపార అనుభవాన్ని, యంత్రాంగాన్ని, వ్యాపార దక్షతను మరియు సాంకేతిక వైపుణ్యతను వినియోగించుకొని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సహకార పాడి రంగంలో సహాయపడుతూ పాడి రైతులకు సరైన ధర చెల్లించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్టంలో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నదని తెలిపారు.

అముల్‌ (ఆనంద్‌ నమునా) పాడి సహకార సంఘాలు ముఖ్యంగా పంచ సూతాలు అనుకరిస్తూ ఇటు ప్రభుత్వం అటు పాడి రైతులతో అనుసంధానం చేయబోతుందని..వాటిలో సమయోచితమైన చెల్లింపులు,సరియగు ధర,పారదర్శకమైన కార్యకలాపాలు,సరైన సమయంలో సాంకేతిక ఉత్పాదక సేవలతో పాటు నిరంతరాదాయ సమాచారం వంటి సూత్రాలతో సేవలు అందించబోతుందని వివరించారు ‌

అలాగే తేది. 21.07.2020 న మన ఆంధ్రప్రదేశ్‌ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌. జగన్మోహన్‌ రెడ్డి గారు అముల్‌ తో ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఒప్పందం ఒక చారిత్రాత్మక ఒప్పందమని,ఈ ఒప్పందం వలన రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళా పాడి రైతులకు సహకార సంఘాల ద్వారా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం మరియు వ్యాపార అవకాశాల ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి మరియు ఆర్థిక స్వావలంబన లభిస్తుంది” అన్నారు.

అలాగే ప్రకాశం జిల్లాలో చూస్తే మొత్తం 8,83,842 పశువులు కలవు. వీటిలో 3,49,206 పశువులు పాలుయిస్తున్నాయి. వీటి ద్వారా ప్రతి రోజు 16,88,251 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుందని తెలిపారు.అలాగే ఈ పాలలో 4,26,643 లీటర్ల పాలను పాడి రైతులు తమ అవసరాల నిమిత్తం వాడుకొనుచున్నారని, మిగిలిన 12,61,608 లీటర్ల పాలలో 7,56,733 లీటర్ల పాలను
సంఘటిత రంగాలలోని వివిధ డైరీలకు సరఫరా చేయుచున్నారని, మిగిలిన 5,04,875 లీటర్ల పాలను స్థానికులకు, వెండర్లకు విక్రయించుచున్నారని తెలిపారు.

ఈ నెల 13 వ తారీఖు నుండి 201 గ్రామాలాలో గ్రామసభలను నిర్వహించి పాడిపశువులు కలిగిన మహిళా రైతులను గుర్తించి, వారిచే తాత్కాలిక “మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను” ఏర్పాటు చేయించి తేది. 20.11.2020 నుండి పాల సేకరణను ప్రారంభించడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందిని. తేది. 25.11.2020 న గౌరవ ముఖ్యమంత్రి గారిచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.

201 గ్రామాలాలో పాల సేకరణ కొరకు మహిళా రైతులను చైతన్య పరిచేందుకు జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేయడం జరిగిందని. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో మరియు గ్రామ స్థాయిలో టాస్క్‌ ఫోర్స్‌ అధికారులను నియమించి వీరికి. శిక్షణ ఇదివరకేఇవ్వబడిందని మంత్రివర్యులు తెలిపారు.

ఈకార్యక్రమంలో మంత్రివర్యులతోపాటు ప్రకాశం జిల్లా కలెక్టర్, మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్, శాసనసభ్యులు సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.