దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 7,992 కొత్త కేసులు నిర్ధారణవ్వడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.46 కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజే కరొనతో 393 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4,75,128 కి చేరింది. గత 24 గంటల్లో 9,265 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3.41 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 93,277 కి చేరింది.