ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని దేశాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ యూరప్‌, అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. దీంతో పాటు ఇప్పుడు తైవాన్‌లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రెండోసారి కరోనా కేసులు ఎలా మొదలయ్యాయి అనే అంశంపై పరిశోధకులు పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో రెండోసారి కరోనా ఒక మహిళా సైంటిస్ట్ కు సోకిందని అమె ద్వారా తైవాన్‌లో మెల్లిగా కేసులు పెరుగుతున్నాయని వెల్లడైంది.

ఇక తైవాన్‌లో హైసెక్యూరిటీ ల్యాబ్‌లో ఆ మహిళ పనిచేస్తున్నది. ఈ ల్యాబ్‌లో కరోనా సోకిన ఎలుక ఆమెను రెండుసార్లు కరిచింది. ఎలుక కరిచిన తరువాతనే ఆ మహిళకు కరోనా సోకినట్టు పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయని, ఎలుకల ద్వారా కరోనా సోకడం నిజమైతే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవలసి వస్తుందని, తైవాన్ పరిశోధకులు వెల్లడించారు.