డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గురువారం చేసిన ట్వీట్ లో భారత దేశం నుండి షెడ్యూల్ చేయబడిన అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల విమానాలపై నిషేధాన్ని జనవరి 31, 2022 వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ పరిమితి అంతర్జాతీయ కార్గో కార్యకలాపాలకు మరియు డిజిసిఏచే ప్రత్యేకంగా ఆమోదించబడిన విమానాలకు వర్తించదు. అంతర్జాతీయ షెడ్యూల్డ్ విమానాలను అధికారులు కేస్-టు-కేస్ ప్రాతిపదికన ఎంపిక చేసిన మార్గాల్లో ఇప్పటికీ అనుమతించవచ్చు.

మార్చి 2020లో కరోనావైరస్ మహమ్మారి యొక్క మొదటి వ్యాప్తి నుండి షెడ్యూల్ చేయబడిన అన్ని అంతర్జాతీయ విమానాలు నిలిపివేయబడ్డాయి. అయితే ఈ సంవత్సరం నవంబర్‌లో, భారత ప్రభుత్వం డిసెంబర్ 15 నుండి షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ విమానాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకున్నప్పటికీ ఆ తర్వాత ఒమిక్రాన్‌ నేపధ్యంలో దానిని రద్దు చేసింది.