డిగ్రీ చదువుతోన్న విద్యార్థినిల కోసం జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్ పేరిట గూగుల్ ఆర్థిక సహకారాన్ని ప్రకటిస్తూ డిసెంబర్ 10 లోగా అప్లై చేసుకోవాలని తెలిపింది. స్కాలర్ షిప్ కు ఎంపికైన విద్యార్థినులకు 1000 డాలర్లు అంటే రూ.75000 ఇవ్వనున్నారు. ఈ స్కాలర్ షిప్ కోసం ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ చదువుతున్న విద్యార్థినిలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీ లేదా సంబంధిత టెక్నికల్ ఫీల్డ్‌లో డిగ్రీ చదువుతున్న విద్యార్థినులకు మాత్రమే అర్హులని ప్రకటించింది. దరఖాస్తు కోసం https://buildyourfuture.withgoogle.com/ వెబ్ సైట్ సందర్శించండి.