ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బాపట్ల ఎంపీ నందిగాం సురేష్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగాడు. దీంతో తుళ్లూరు పోలీసులను ఆశ్రయించిన ఎంపీ పీఏ ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో తుల్లూరు పోలీసులు రంగంలోకి దిగారు.

ఆ వ్యక్తి ఫోన్‌ నంబర్‌ ఆధారంగా ఫోన్‌ చేసిన వ్యక్తి బాబూరావుగా గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బాబూరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది.. ఎంపీ నందిగాం సురేష్‌తో అసలు బాబూరావుకు ఉన్న వైరం ఏంటి..? ఏదైనా రాజకీయ కోణం ఉందా? అనే విషయాలను పోలీసులు విచారిస్తున్నారు.