ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కు ఇటలీ దేశాని కి చెందిన కాంపిటీషన్ అథారిటీ షాక్ ఇస్తూ భారీ జరిమానా విధించింది. తమ దేశంలో ఉన్న నిబంధనలు పాటించలేదని రూ. 9.6 వేల కోట్ల ( 1.28 బిలియన్ డాలర్లు) భారీ జరిమానా ను విధించింది. అమెజాన్ కంపెనీ తన వేర్ హౌస్ మరియు డెలివరీ సిస్టమ్ లను ఉపయోగించి థర్డ్ పార్టీ వారికి అమెజాన్ ప్రత్యేక మైన సేవలు అందించిందని కాంపిటీషన్ అథారిటీ ఆరోపించింది.

అమెజాన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇతర విక్రయదారులకు తీవ్రంగా నష్టం వచ్చిందని, అమెజాన్ సేవలు థర్డ్ పార్టీ కి సంబంధం లేకుండా నేరు గా విక్రయించాలని ఆదేశించింది. అలాగే దీనిలో ఎలాంటి వివక్ష లేకుండా ఉండాలని కూడా సూచించింది. అయితే అమెజాన్ కు విధించిన జరిమానా భరిస్తుందా లేదా అనేది మాత్రం ట్రస్టీ పర్యవేక్షణలో తేలుస్తుంది.