వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలంలోని చిల్ముల్‌మైలారానికి చెందిన రుత్విక్‌రెడ్డి అనే విద్యార్థి అమెరికాలో ఎంఎస్‌ చదువుతున్నారు. తాజాగా ఆయన కళాశాల ప్రాంగణ ఎంపికలో అమెజాన్‌ సంస్థలో రూ.96 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించారు. రుత్విక్‌రెడ్డి తండ్రి మధుసూదన్‌రెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతుండగా, తల్లి హైదరాబాద్‌లోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు.