ఏపీలోని జగన్ గవర్నమెంట్ జిల్లాల వారీగా ఖాళీల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాల భర్తీకి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో జనవరి 10 లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు: ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో OC(W) విభాగంలో 1, OC-G(EWS) విభాగంలో-1, ఎస్సీ(W) విభాగంలో 1, బీసీ-ఏ(W)-1, బీసీ-ఏ(జీ) విభాగంలో 2, బీసీ-డీ(W) విభాగంలో 1, బీసీ-(W)-1, పీహెచ్-HH(G)-1 ఖాళీ ఉంది. ఎంబీబీఎస్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.53,495 వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థులు DM&HO Office, Kakinada చిరునామాలో దరఖాస్తులను ఈ నెల 10వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.