ఏపిలో మార్చి నెలలో పదో తరగతి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా వినుకొండలో మీడియాతో మాట్లాడిన ఆయన 7 సబ్జెక్టులతో పరీక్షలు ఉంటాయని, సీబీఎస్‌ఈ సిలబస్‌ వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని వెల్లడించారు. 2024-25 విద్యా సంవత్సరానికి సీబీఎస్‌ఈలో పదో తరగతి మొదటి బ్యాచ్‌ పరీక్ష నిర్వహించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా వెల్లడించారు.