మధ్యతరగతి వారి కోసం ఎకానమీ ఏసీ-3 టైర్ కోచ్‌లు రూపొందించారు. రైల్వేశాఖవారు ప్రధానంగా సాధారణ ప్రజలకి మంచి అనుభూతి కలిగించేందుకు ఈ ప్రత్యేక కోచ్ లను ఆవిష్కరించింది.ఇవి ముఖ్యముగా ఇవి ఎకానమీ కోచ్‌లు..

ఏసీ రైలు ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు కొత్త కోచ్‌లను మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌ల స్థానంలో ప్రవేశపెట్టనున్నారు.

అత్యుత్తమ ప్రమాణాలతో తయారుచేసిన కొత్త 3-టైర్‌ కోచ్‌లలో 83 చొప్పున బెర్త్‌లు ఉంటాయి.ప్రస్తుతమున్న 3-టైర్‌ కోచ్‌లలో బెర్త్‌లు 64, స్లీపర్‌ క్లాస్‌లో 72 చొప్పున ఉన్నాయి.

కొత్త కోచ్‌లలో ప్రతి బెర్త్‌కు ప్రత్యేకంగా ఏసీ వెంట్‌లు, రీడింగ్‌ లైట్లు, యూఎస్‌బీ చార్జర్‌ ఉంటాయి.

ఫైర్‌-ప్రూఫ్‌ బెర్త్‌లు, పై బెర్త్‌లకు ఎక్కేందుకు ఆధునీకరించిన నిచ్చెనలు ఇతర ప్రత్యేకతలు. కొత్త కోచ్‌లను ఇంజనీరింగ్‌ అద్భుతంగా తీర్చిదిద్దింది.ఇన్ని సౌకర్యాలు కలిగి ఉన్న రైలు ప్రయాణం చేసి ఒక సరికొత్త అనుభూతి మీ సొంతం చేసుకోండి.