ఎన్నికలు (Elections)

ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వచ్చిన సిబ్బందికి గ్లవ్స్, శానిటైజర్, అందజేయాలి-అనుపమ అంజలి

రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి.

    ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వచ్చిన సిబ్బందికి గ్లవ్స్, శానిటైజర్, అందజేయాలని రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి అన్నారు. ఎన్నికల సిబ్బందికి ఇస్తున్న అవగాహనను ఆమె పరిశీలించారు. రాజమహేంద్రవరం డివిజన్ లో గల ఆలమూరు  మండలంలో ఈ నెల 13వ తేదీ శనివారం జరగనున్న రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యిందిని, ఆలమూరు ఎంపీడీవో, ఎన్నికల అధికారి జెఏ ఝాన్సీ, మండల ప్రత్యేక అధికారి సత్యవేణు' తహశీల్దార్ లక్ష్మీపతి రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కు వివరించారు. శుక్రవారం మండల కేంద్రమైన ఆలమూరు మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎన్నికల సిబ్బంది, ఉద్యోగులతో నిర్వహించిన సమావేశాని ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఓటర్లు పట్ల మర్యాద పూర్వకంగా మెలగాలని సూచించారు. అనంతరం ఎంపీడీవో ఝాన్సీ ఎన్నికల సామాగ్రిని సిబ్బందికి అందజేసి మాట్లాడుతూ ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు విధిగా మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించేలా కొవిడ్ నిబంధనలపై గ్రామాల్లో ప్రచారం నిర్వహించేందుకు పంచాయితీ కార్యదర్శులు కృషి చేయాలన్నారు. ఎన్నికలను నిర్వహించనున్న పోలింగ్ బూత్ ల్లో సిబ్బందికి గ్లోవ్స్, శానిటైజర్ అందజేయనున్నట్లు వారు వెల్లడించారు. గుమ్మిలేరు ఏకగ్రీవం అవ్వడంతో మిగిలిన 17 పంచాయతీ సర్పంచులు, 198 వార్డు సభ్యుల పదవులకు జరిగే పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించామని అన్నారు. సమావేశంలో ఈవోపీఆర్డీ రాజ్  కుమార్, ఆర్ఐ జానకి రాఘవ, ఆర్ రామచంద్ర మూర్తి, డిప్యూటీ తహశీల్దార్ కె జానకీ రామయ్య    తదితరులు పాల్గొన్నారు.
close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.