జాతీయం (National)

ఆంధ్ర‌, ఒడిషా మధ్య పంచాయ‌తీ ఏంటి ?

చాలాకాలం పాటు పేచీలు, కోర్టులు, కేసుల మీమాంస త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఎన్నిక‌లు బాగా జ‌రుగుతున్నాయి అనుకుంటుండ‌గా ఇప్పుడు ఒక కొత్త వివాదం తెర‌పైకి వ‌చ్చింది. పంచాయ‌తీ ఎన్నిక‌లు రెండు రాష్ట్రాల మ‌ధ్య వివాదానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నిర్వ‌హిస్తున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై ఒడిషా అభ్యంత‌రం చెబుతోంది. ఏపీ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్న కొన్ని గ్రామాలు త‌మ రాష్ట్రానివ‌ని ఒడిషా వాధిస్తోంది.

ఏపీ, ఒడిషా స‌రిహ‌ద్దులోని విశాఖ‌ప‌ట్నం జిల్లాలో గంజాయ్ భ‌ద్ర అనే గ్రామం ఉంది. ఈ గ్రామాన్ని ఒడిషా గంజాయ్ ప‌ద‌వ‌ర్ అని పిలుస్తోంది. ప‌ట్టు చెన్నూరు అని ఏపీ పిలిచే మ‌రో గ్రామాన్ని ప‌ట్టు సెన‌రీ అని ఒడిషా పిలుస్తోంది. ప‌గులు చినేరు అని ఏపీ పిలిచే మ‌రో గ్రామాన్ని ఫ‌గ‌లు సెన‌రీ అని ఒడిషా పిలుస్తోంది. ఈ మూడు గ్రామాలు మావంటే మావ‌ని ఏపీ, ఒడిషా ప‌ట్టుప‌డుతున్నాయి. త‌మ రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లాలో ఈ మూడు గ్రామాలు ఉన్నాయ‌ని ఒడిషా అంటోంది.

ఈ గ్రామాల్లో ఇప్ప‌టికే తాము స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించామ‌ని, ఇప్పుడు మ‌ళ్లీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తోంద‌ని ఆరోపిస్తూ ఒడిషా ప్ర‌భుత్వం సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. వారం లోగా ఈ విష‌య‌మై వివ‌ర‌న ఇవ్వాల‌ని సుప్రీం కోర్టు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.