వార్తలు (News)

కరోనా వాక్సిన్: ఎవరికి కరోనా వాక్సిన్ దొరికే అవకాశం ఉంది.. ఎవరికి అవకాశం లేదు?

కోవిడ్-19 వ్యాక్సీన్ తీసుకుంటున్నవారి చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా అందరిలో సంతోషాన్ని నింపుతున్నాయి.బ్రిటన్‌లో వ్యాక్సీన్ అందుబాటులోకి తేవడాన్ని చూసిన తరువాత జింబాబ్వేకి చెందిన లూయిస్ చింగాండూ ఉత్సాహానికి బదులు ఆందోళన చెందారు.


చాలామందిలా ఆమె కూడా వ్యాక్సీన్ వేయించుకుని కోవిడ్‌కు మునుపటిలా సాధారణ జీవితం గడపాలని కోరుకుంటున్నారు.కానీ, మిగతా దేశాలవారిలా కాకుండా తమ దేశంలో వ్యాక్సీన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి ఆమెది.‘‘అసలు నా జీవిత కాలంలో మా దేశంలో కోవిడ్ వ్యాక్సీన్ వస్తుందా అనేది అనుమానమే’’ అంటారామె.అంతేకాదు.. ‘‘నాకు కరోనా వచ్చి మరణిస్తానేమో అన్న భయంతో బతుకుతున్నాను’’ అంటారామె.ఆమె అనవసరంగా భయపడుతున్నారని అనిపించొచ్చు.. కానీ, ఇలాంటి దుర్భర పరిస్థితులను గతంలోనూ ఆమె తన దేశంలో చూశారు. అందుకే ఆమెలో ఆ భయం.ఎందుకంటే జింబాబ్వే, మెక్సికో, పాకిస్తాన్ వంటి దేశాల్లో వ్యాక్సీన్ పొందడమనేది కష్టతరం కానుంది.

లూయిస్ ఒక హెచ్ఐవీ నిరోధక కేంద్రంలో పనిచేస్తున్నారు. 990 చివర్లో జింబాబ్వే రాజధాని నగరం హరారేలో ప్రతి రోజూ వేలాది మంది ఎయిడ్స్‌తో చనిపోవడాన్ని ఆమె చూశారు. ఎయిడ్స్ మరణాలను ఆపడానికి మందులు అప్పటికే ఉన్నాకూడా అవి కొనే ఆర్ధిక స్తోమత అక్కడి ప్రజలకు లేదు.‘‘పేదలను రక్షించాల్సిన సమయం వచ్చిందని సమాజంలో ధనిక వర్గంలో ఉన్నవారు అనుకున్నప్పుడు మాత్రమే మాకు వ్యాక్సీన్ దొరుకుతుంది’’ అని లూయిస్ అన్నారు.

‘పీపుల్స్ వ్యాక్సీన్ అలయన్స్’ అనే ఒక ప్రచార బృందంలో లూయిస్ సభ్యురాలు.

ఈ సంస్థ ధనిక దేశాలను అనగా ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, కెనడా, యూరోపియన్ యూనియన్‌లోని దేశాలను వ్యాక్సీన్ కాస్తా మిగతా ప్రపంచం కోసం కూడా ఉంచమని చెబుతోంది.డ్యూక్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్న ప్రకారం కొన్ని దేశాలు తమ జనాభాకు అవసరమైన కంటే కూడా అదనంగా టీకా డోసులను సంపాదించుకున్నాయి.కెనడా తన దేశ జనాభాకు అయిదు సార్లు వేయడానికి సరిపడినంత టీకాలను సంపాదించుకుందని ఈ పరిశోధకులు చెబుతున్నారు.

వ్యాక్సీన్ కంపెనీలు, ప్రభుత్వాల మధ్య ఒప్పందాలను ఈ పరిశోధకులు ట్రాక్ చేస్తున్నారు.ఇలాంటి దేశాలు వ్యాక్సీన్లు కొనుగోలు చేయడంలో రిస్క్ తీసుకున్నాయి.
ఆయా వ్యాక్సీన్లు సురక్షితం, సమర్థవంతం అని నిరూపణ కావడానికి ముందే కొనుగోలుకు ఒప్పందాలు చేసుకుంటూ వాటి అభివృద్ధికి ఆర్థిక సహాయం చేశాయి.

ఇలాంటి విధానాల వల్ల పేద దేశాలకు అన్యాయం జరుగుతుందని లూయిస్ సహా ‘పీపుల్స్ వ్యాక్సీన్ అలయన్స్’ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.

ఆయా దేశాల్లో అదనంగా ఉన్న టీకాలను అవసరమైన దేశాలకు పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతుతో మరికొన్ని సంస్థలు కలిసి కోవాక్స్ అనే ఇనిషియేటివ్ ద్వారా 189 దేశాల కోసం వ్యాక్సీన్ కొనుగోలు ఒప్పందాలు చేస్తున్నాయి.ఇందులో 92 దేశాలు అల్ప, మధ్యాదాయ దేశాలు. దాతలు ఏర్పాటు చేసిన సహాయ నిధితో ఆ దేశాలకు వ్యాక్సీన్ సమకూరుతోంది.

ఆ నిధికి బ్రిటన్ 50 కోట్ల డాలర్లు ఇచ్చింది కానీ అమెరికా, రష్యా వంటి కొన్ని ధనిక దేశాలు ఈ నిధికి తమ వంతున ఏమీ ఇవ్వలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ 92 కాకుండా మిగతా దేశాలు ఎవరికి వారు వ్యాక్సీన్ కొనుగోలు చేస్తున్నారు. కోవాక్స్ ఇప్పటివరకు 3 కోవిడ్-19 వ్యాక్సీన్ల కోసం ఒప్పందాలు చేసుకుంది.అయితే, ఆయా దేశాల జనాభాలో 20 శాతం జనాభాకు సరిపడా మాత్రమే అందించనుంది.

‘రానున్నవి క్లిష్టమైన నెలలు’మెక్సికో కూడా కోవాక్స్ నుంచి వ్యాక్సీన్ కొనుగోలు చేస్తోంది.
అయితే, కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్న తమ దేశానికి 20 శాతం వ్యాక్సీన్ అయితే చాలదని ఆ దేశంలో వ్యాక్సీన్ కొనుగోలు వ్యవహారాలు చూస్తున్న మార్తా డెల్గాడో అభిప్రాయపడుతున్నారు.

అందుకే , వ్యాక్సీన్ సంపాదించడానికి ఇతర మార్గాలనూ అన్వేషిస్తున్నారు.అందులో ఫైజర్ కూడా ఒకటి. ఫైజర్ వ్యాక్సీన్ వినియోగానికి మెక్సికోలో శుక్రవారం అనుమతులిచ్చారు కూడా.

దీంతో ఈ నెలలో ఆ వ్యాక్సీన్లు వేసే కార్యక్రమంలో మెక్సికోలో మొదలుకానుంది.
మెక్సికన్ దేశంలో కనీసం వ్యాక్సీన్ కొనుగోలు చేయడానికి డబ్బులున్నాయి.లాటిన్ అమెరికా ప్రాంతంలోని అనేక దేశాల వద్ద వ్యాక్సీన్లు కొనడానికి డబ్బు లేదు’’

దీంతో చాలా దేశాలకు కోవాక్స్ మాత్రమే ఆధారం.మరోవైపు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాలు తాము సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సీన్‌ను వర్ధమాన దేశాలకు విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకోవడం లేదని స్పష్టం చేశాయి.

మెక్సికన్ బాటలోనే పాకిస్థాన్ లో ప్రత్యేక సహాయకుడిగా ఉన్న ఫైజల్ సుల్తాన్ వ్యాక్సీన్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇంకా ఏ సంస్థతోనూ ఒప్పందాలు జరగలేదని ఫైజల్ చెప్పారు.వ్యాక్సీన్ పనిచేస్తుందో లేదో తెలియకుండా డబ్బులు పెట్టే పరిస్థితిలో లేదు పాకిస్తాన్.అలా తెలియకుండానే వ్యాక్సీన్ కొనుగోలు చేస్తున్న దేశాలున్నాయి.సరైన టీకా లభిస్తే మేం కొంటాం. అలా అని గుడ్డిగా వెళ్లం’’ అన్నారు డాక్టర్ ఫైజల్ సుల్తాన్.
నా సంస్థ కెన్‌సినో బయో తరఫున క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి పాకిస్తాన్‌లోని ప్రముఖ యూనివర్సిటీలన్నీ సహకరించాయి.అందువల్ల ఆ సంస్థ నుంచి ఆ దేశం వ్యాక్సీన్ పొందే అవకాశలుంటాయి. వ్యాక్సీన్ ఒప్పందాలు చేసుకోవడంలో డబ్బు ఒక్కటే కీలకం కాదని మంచి దౌత్య సంబంధాలూ కీలకమేనని మెక్సికో తరఫున వ్యాక్సీన్ ఒప్పందాల వ్యవహారాలు చేస్తున్న డెల్గాడో అన్నారు.

మరోవైపు పీపుల్స్ వ్యాక్సీన్ అలయన్స్ సంస్థ, లూయిస్ చెంగాండూ వంటివారు మరో ప్రతిపాదనా తీసుకొస్తున్నారు.

కంపెనీలు వ్యాక్సీన్‌కు సంబంధించిన మేథో సంపత్తిని ప్రపంచంతో పంచుకుంటే ఆయా దేశాల్లోని సంస్థలే తయారుచేసుకోగలుగుతాయని వారంటున్నారు.

కైస్తవం, ఇస్లాంలోకి మారితే..ఎస్సీ, ఎస్టీలు రిజర్వేషన్లకు అనర్హులే : కేంద్రం
కోవిడ్ వ్యాక్సీన్‌కు సంబంధించి మేథో సంపత్తి హక్కులు రద్దు చేయాలా వద్దా అనే విషయంలో డబ్ల్యూటీఓ ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు.

కోవిడ్ వ్యాక్సీన్ మేథో సంపత్తి హక్కులు రద్దు చేయాలన్న ప్రతిపాదనకు డబ్ల్యూటీవోలో కొన్ని దేశాల నుంచి మద్దతు వచ్చినప్పటికీ చాలా పాశ్చాత్య దేశాలు మాత్రం వ్యతిరేకించాయి.

‘‘వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చిన దేశాల్లో ప్రజలు సాధారణ జీవితం పునఃప్రారంభించబోతుంటే మిగతా దేశాల్లో మాత్రం కరోనావైరస్ కారణంగా ప్రజలు ఇంకా చనిపోతారు’’ అని లూయిస్ చెంగాండూ ఆవేదన చెందారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.