టెక్నాలజీ (Technology) వార్తలు (News)

కొన్ని ఆండ్రాయిడ్ అప్స్ తో భద్రం

మీ బ్యాంక్ అకౌంట్ మరియు మీ మొబైల్ ఫోన్ అనుసంధానించి ఉన్నాయా? అది నిజమే అయితే మీరు ఖశ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. అదేంటంటే.. కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్ స్మార్ట్‌ఫోన్ నుంచి బ్యాంక్ అకౌంట్ వివరాలు తస్కరిస్తున్నాయి. ఒక రీసెర్చ్‌లో విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చాయి. స్మార్ట్‌ఫోన్‌లో ఉండే కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్ బ్యాంక్ అకౌంట్ వివరాలను తస్కరించడంతో కస్టమర్లు వారి అకౌంట్ల నుంచి డబ్బులు పొగొట్టుకునే అవకాశం ఉంది. అందువల్ల మీరు ఇలాంటి యాప్స్‌ను వెంటనే ఫోన్ నుంచి తొలగించడం మంచిది. ఇప్పుడు ఆ అప్స్ వివరాల మీద ఒక కన్ను వేయండి.


Cake VPN
Pacific VPN
eVPN
BeatPlayer
Music Player
tooltipnatorlibrary
QRecorder

పైనచెప్పిన యాప్స్ ఏమైనా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటే వెంటనే వాటిని డిలైట్ చేయడం ద్వారా మీ డబ్బును జాగ్రత్త పరచుకోండి. ఈయాప్స్ మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు తస్కరించడం ద్వారా అవి మోసగాళ్ళకు చేరే అవకాశం ఉంది. వారు మీ బ్యాంకు అకౌంట్ లోని డబ్బులు మాయం చేసే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.