జాతీయం (National) వార్తలు (News)

వరుసగా 4 రోజులు నిలిచిపోనున్న బ్యాంకింగ్ సేవలు

ప్రభుత్వరంగ సంస్థల్లో రేపటి (శనివారం) నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్‌ సేవలు నిలిచిపోనున్నాయి. శనివారం, ఆదివారం శలవు దినాలు కాగా, మిగిలిన రెండు రోజులు సమ్మె ఉన్న కారణంగా బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో ఉండవు.


మార్చి 13వ తేదీ రెండో శనివారం, 14వ తేదీ ఆదివారం కావడంతో ఆ రెండు రోజులూ బ్యాంకులు పనిచేయవు. 15, 16 తేదీల్లో సమ్మె కారణంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో సేవలు నిలిచిపోనున్నాయి. ప్రైవేటు బ్యాంకులు, ఏటీఎం, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు మాత్రం యథాతథంగా పనిచేస్తాయి.

ఇటీవల కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ రెండు ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు ఒక ప్రభుత్వరంగ బీమా సంస్థను ప్రైవేటీకరించనున్నట్లు బడ్జెట్‌ సందర్భంగా ప్రకటించడంతో దానికి వ్యతిరేకంగా తొమ్మిది యూనియన్లతో కూడిన ది యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) సమ్మె తలపెట్టింది. 10 లక్షల మంది ఈ సమ్మెలో పాల్గొంటారని అంచనా. సమ్మె కారణంగా ఎస్‌బీఐ, కెనరా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకు సేవలకు అంతరాయం కలగనుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.