ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమ్ఇండియా మునుపటి మ్యాజిక్ ను ఈసారి పునరావృతం చేయలేకపోయింది. 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 124 పరుగులే చేసింది. శ్రేయస్ అయ్యర్ (67; 48 బంతుల్లో 8×4, 1×6) మాత్రమే అర్ధశతకంతో రాణించాడు. ఆఖరి ఓవర్లో ఔటయ్యారు.
రిషభ్ పంత్ (21; 23 బంతుల్లో 2×4, 1×6) కాసేపు నిలువరించడం, ఆర్చర్ బౌలింగ్‌లో రివర్స్‌స్వీప్‌తో సిక్సర్ కొట్టడం, హార్దిక్ పాండ్య (19; 21 బంతుల్లో 1×4, 1×6) సైతం కొంత సమయం అయ్యర్‌కు అండగా నిలవడంతో, ఇంగ్లాండ్ ఐదుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌ను ప్రయోగించింది. ఆర్చర్ 3 వికెట్లు తీశాడు.